Translate

Thursday, June 25, 2026

కుటుంబ బంధాలే నిజమైన సంపద కాదా?

 కుటుంబ బంధాలే నిజమైన సంపద కాదా?

కలిసుంటేనే కుటుంబం

రచన: డా. భోగయగారి చంద్రశేఖర శర్మ
గజిటెడ్ హెడ్మాస్టర్, సికింద్రాబాద్

👨‍👩‍👧‍👦 పల్లవి 👨‍👩‍👧‍👦

కలిసుంటేనే కుటుంబం,
విడిపోతే అది విలాపం!
కుటుంబ విలువలు పాటిద్దాం,
సంతోషాలను సాధిద్దాం!!

|| కలిసుంటేనే కుటుంబం,
విడిపోతే అది విలాపం ||

చరణం – 1

పండుగలెన్నో జరుపుకున్నను,
ఆచారమ్ములు కలిగియున్ననూ,
సమస్యలెన్నో ఎదురైయున్నను,
సహనమెప్పుడు చూపిద్దాం!
శాంతితో సతతం జీవిద్దాం!!

|| కలిసుంటేనే కుటుంబం,
విడిపోతే అది విలాపం ||

చరణం – 2

తల్లిదండ్రులను అదరించుచూ,
అతిథులనెపుడు స్వాగతించుచూ,
బంధుజనులకు మర్యాదిచ్చుచు,
నీతినియమాలు కలిగుందాం,
నిజాయితీని పాటిద్దాం!!

|| కలిసుంటేనే కుటుంబం,
విడిపోతే అది విలాపం ||

సందేశం:

కుటుంబం అనేది కేవలం రక్త సంబంధాల సమూహం కాదు; ప్రేమ, అనురాగం, సహనం, పరస్పర గౌరవం అనే విలువలతో నిలిచే పవిత్ర బంధం. కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉంటే ఆనందం పెరుగుతుంది, సమస్యలు చిన్నవిగా మారుతాయి. అందుకే కుటుంబ ఐక్యతను కాపాడుకుంటూ, పెద్దలను గౌరవిస్తూ, కుటుంబ విలువలను తరతరాలకు అందిద్దాం.

– సేకరణ & ప్రచారం కోసం
తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా

No comments:

Post a Comment

కుటుంబ బంధాలే నిజమైన సంపద కాదా?

  కుటుంబ బంధాలే నిజమైన సంపద కాదా? కలిసుంటేనే కుటుంబం రచన: డా. భోగయగారి చంద్రశేఖర శర్మ గజిటెడ్ హెడ్మాస్టర్, సికింద్రాబాద్ 👨‍👩‍👧‍👦 పల్లవి ...