Translate

Sunday, July 5, 2026

పోలీసులను పెళ్లి చేసుకోవద్దు...

అవును... పోలీసులను పెళ్లి చేసుకోవద్దు...

ఎందుకంటే...
వాళ్లకు కుటుంబం కంటే విధి ముఖ్యం.
మీ పుట్టినరోజైనా... పెళ్లిరోజైనా... పండుగైనా...
ఒక ఫోన్ కాల్ వస్తే చాలు...
"డ్యూటీ ఉంది" అని వెళ్లిపోతారు.

డాక్టర్లను కూడా చేసుకోవద్దు...
మీ జ్వరం కంటే... ఆసుపత్రిలో ఉన్న రోగి ప్రాణమే వారికి ముఖ్యం.

టీచర్లను కూడా వద్దు...
తమ పిల్లలతో పాటు...
వందల మంది పిల్లల భవిష్యత్తును మోస్తుంటారు.

వ్యాపారస్తులను కూడా వద్దు...
వాళ్ల నిద్ర కూడా లాభనష్టాల లెక్కల మధ్యే ఉంటుంది.

అయితే...

ఎవరిని చేసుకోవాలి...?

లంచంతో బంగ్లాలు కట్టినవాళ్లను చేసుకోండి...
ఒకరోజు దొరికితే...
మీ ఇంటి గుమ్మం దగ్గరే మీడియా క్యాంప్ వేస్తుంది.

రోజంతా అనుమానంతో బ్రతికేవాళ్లను చేసుకోండి...
ఫోన్ మోగినా విచారణ...
నవ్వినా విచారణ...
ఆలస్యంగా వచ్చినా విచారణ...
జీవితం మొత్తం రిమాండ్‌లోనే ఉంటుంది.

పని చేయకుండా తిరిగేవాళ్లను చేసుకోండి...
మీ జీతమే వారి ఉద్యోగం.

మద్యం షాపుకే ఇంటి అడ్రస్‌గా పెట్టుకున్నవాళ్లను చేసుకోండి...
ప్రతి నెలా ఖాళీ సీసాలు అమ్మి "సేవింగ్స్" చేసుకోవచ్చు.

కానీ...

రాత్రింబవళ్లు ప్రజల కోసం తిరిగే పోలీసును మాత్రం చేసుకోవద్దు...

ఎందుకంటే...

అతని దగ్గర నల్లధనం ఉండకపోవచ్చు...
కానీ నిద్రలేని రాత్రులు ఉంటాయి.

అతని దగ్గర ఖాళీ సమయం ఉండకపోవచ్చు...
కానీ బాధ్యత ఉంటుంది.

అతని దగ్గర విలాస జీవితం ఉండకపోవచ్చు...
కానీ యూనిఫామ్‌కు తగ్గ గౌరవం ఉంటుంది.

కొంతమందికి...
సమయం ఇవ్వలేని మనిషి సమస్య...

కానీ...

సమాజానికి సమయం ఇచ్చే మనిషి విలువ అర్థమైతే...
ఈ మాట ఎప్పుడూ రాదు.

కలం తో మార్పు : తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా 

No comments:

Post a Comment

పోలీసులను పెళ్లి చేసుకోవద్దు...

అవును... పోలీసులను పెళ్లి చేసుకోవద్దు... ఎందుకంటే... వాళ్లకు కుటుంబం కంటే విధి ముఖ్యం. మీ పుట్టినరోజైనా... పెళ్లిరోజైనా... పండుగైనా... ఒక ఫో...